ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు ఉన్నప్పటికీ అద్దె భవనాల్లోనే విధులు కొనసాగిస్తున్నారు. మెదక్ జిల్లా కేంద్రంలో లక్షల రూపాయలు ఖర్చుచేసి భవనాలను నిర్మించారు. ప్రస్తుతం అవి వృథాగా ఉంటున్నాయి. పాల శీతలీకరణ కేంద్రం, నీటి పరీక్షల భవనం, ఐసీడీఎస్, గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం ఏఈ కార్యాలయం భవనాలు ప్రస్తుతం ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఇన్ని ప్రభుత్వం భవనాలు వృథాగా ఉన్నప్పటికీ... ఎస్టీవో కార్యాలయం ఇంకా అద్దె భవనంలోనే కొనసాగుతోంది.
అలా చేస్తే అద్దె తప్పుతుంది...