ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెదక్ సీఎస్ఐ చర్చిలో ఈస్టర్ వేడుకలను బిషాప్ సాల్మన్ రాజు నిరాడంబరంగా నిర్వహించారు. డిజిటల్ రూపంలో భక్తులకు ఉదయం 5 గంటల నుంచి దైవసందేశం అందించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ వేడుకలు జరుపుతున్నారు ఆయన తెలిపారు.
మెదక్ చర్చ్‌లో నిరాడంబరంగా ఈస్టర్ వేడుకలు - లాక్డౌన్
ఈస్టర్ పర్వదినాన్ని పురస్కరించుకుని మెదక్ సీఎస్ఐ చర్చ్‌లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. లాక్డౌన్ నేపథ్యంలో కేవలం ఐదుగురు మత గురువులు మాత్రమే వేడుకలు నిర్వహించారు. కరోనా పై మానవాళి విజయం సాధించేలా అందరికీ శక్తిసామర్థ్యాలు ఇవ్వాలని బిషప్ ప్రార్థించారు.
Ester celebrations
లాక్డౌన్ నేపథ్యంలో భక్తులు ఎవరిని చర్చ లోపలికి అనుమతించకుండా కేవలం ఐదుగురు మత గురువులు మాత్రమే వేడుకలు నిర్వహించారు. కరోనా పై మానవాళి విజయం సాధించేలా ఏసుప్రభువు అందరికీ శక్తిసామర్థ్యాలు ఇవ్వాలని ప్రార్థిస్తున్నట్లు బిషప్ సాల్మన్ రాజు తెలిపారు.
ఇవీ చూడండి:వెళ్లలేరు.. ఉండలేరు..