తెలంగాణ తొలి మహిళా కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. కమిషన్ ఛైర్‌పర్సన్‌గా మాజీ మంత్రి వాకిటి సునీతాలక్ష్మారెడ్డిని నియమించింది. సభ్యురాళ్లుగా గద్దల పద్మ(వరంగల్ జడ్పీ మాజీ ఛైర్‌పర్సన్), షాహీనా అఫ్రోజ్(హైదరాబాద్, మహబూబ్‌గంజ్ మార్కెట్ కమిటీ మాజీ ఛైర్‌పర్సన్), కుమ్ర ఈశ్వరీబాయి(ఇంద్రవెల్లి మాజీ ఎంపీపీ), కొమ్ము ఉమాదేవియాదవ్ (మంచిర్యాల), సూదం లక్ష్మి (నిజామాబాద్), కటారి రేవతిరావు (పెద్దపల్లి)లు నియమితులయ్యారు. అయిదేళ్ల పాటు వీరు పదవిలో కొనసాగుతారు.
రాష్ట్ర విభజన జరిగి తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఉమ్మడి కమిషనే మూడేళ్లపాటు కొనసాగింది. తాజాగా మొదటి కమిషన్ నియామకం జరిగింది. మెదక్ జిల్లా శివ్వంపేట మండలం గోమారం గ్రామానికి చెందిన సునీత (52)ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పదవికి ఎంపిక చేశారు. కాంగ్రెస్ పార్టీ తరఫున నర్సాపూర్ నియోజకవర్గం నుంచి 1999, 2004, 2009లలో మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆమె 2009లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మంత్రివర్గంలో చిన్ననీటి వనరుల శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత రోశయ్య మంత్రివర్గంలో కొనసాగారు. 2010లో కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గంలో మహిళాశిశు, దివ్యాంగుల సంక్షేమం, స్వయం సహాయక సంఘాలు, ఇందిరా క్రాంతిపథం, పింఛన్ల శాఖ మంత్రిగా విధులు నిర్వర్తించారు. 2004 నుంచి 2009 వరకు శాసనసభ మహిళా శిశు సంక్షేమ కమిటీ ఛైర్‌పర్సన్‌గా ఉన్నారు. 2014, 2018 ఎన్నికల్లో ఓడిపోయిన ఆమె 2019 ఏప్రిల్‌లో సీఎం కేసీఆర్ సమక్షంలో తెరాసలో చేశారు. తాజాగా మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ పదవి కోసం వివిధ పేర్లను పరిశీలించిన సీఎం అనుభవం దృష్ట్యా ఆమెను ఎంపిక చేశారు. సభ్యురాళ్లుగా జిల్లాల్లో మహిళల సేవకు కృషి చేసిన ఆరుగురికి అవకాశం ఇచ్చారు.
అప్పుడు మంత్రిగా... ఇప్పుడు ఛైర్‌పర్సన్‌గా
2010 నుంచి 2014 ఏప్రిల్ వరకు సునీత స్త్రీ, శిశు సంక్షేమ మంత్రిగా పనిచేశారు. మహిళా కమిషన్ ఈ శాఖ పరిధిలోనిదే. ఇప్పుడు ఆమె ఆ కమిషన్‌కు ఛైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు.
మిగిలిన కమిషన్ల నియామకాలపై సీఎం దృష్టి