తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏడుపాయల మాఘ అమావాస్య స్నానాలకు ఏర్పాట్లు పూర్తి - Medak District Latest News

ఏడుపాయల్లో మాఘ అమావాస్య స్నానాలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ఈవో శ్రీనివాస్ తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని మౌలిక వసతులు కల్పించామని పేర్కొన్నారు. కరోనా నిబంధనలు పాటించాలని సూచించారు.

Arrangements are complete for the Yedupayala Magha Baths
ఏడుపాయల మాఘ అమావాస్య స్నానాలకు ఏర్పాట్లు పూర్తి

By

Published : Feb 10, 2021, 1:36 PM IST

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మెదక్ జిల్లా ఏడుపాయల్లో మాఘ అమావాస్య స్నానాలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ఈవో శ్రీనివాస్ తెలిపారు. స్వయంభువుగా వెలసిన శ్రీ వన దుర్గ భవాని దేవస్థానానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని మౌలిక వసతులు కల్పించామని వెల్లడించారు.

మాఘస్నానాలు చేయడానికి సింగూరు నుంచి నీటిని విడుదల చేసినట్లు తెలిపారు. పుణ్య స్నానాలకు వచ్చే భక్తులకు ఆర్టీసీ బస్సుల సౌకర్యాలున్నాయని పేర్కొన్నారు.

వనదుర్గ ప్రాజెక్టులో పుష్కలమైన నీరు ఉందని, భక్తులు లోతట్టు ప్రాంతాలకు వెళ్లకుండా మాఘ స్నానాలు చేసి అమ్మవారికి మొక్కులు చెల్లించు కోవాలని కోరారు. కరోనా నిబంధనలు పాటించాలని సూచించారు.

ఇదీ చూడండి:మీకు తెలుసా... పాదం మోపలేని పార్కు!

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details