రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చిందని మెదక్ జిల్లా నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి అన్నారు. నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలోని మండలాలకు తెరాస మండల అధ్యక్షులను ఎంపిక చేశారు. పదవులు రాలేదని నిరాశ చెందొద్దని మిగిలిన వారిలో మదన్ రెడ్డి ఉత్సాహం నింపారు. రాష్ట్రంలో 9 కమిటీలు ఉన్నాయని తెలిపి నియోజకవర్గ స్థాయిలోని కమిటీలను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సునీతా రెడ్డి, మురళియాదవ్ పాల్గొన్నారు.
నర్సాపూర్‌లో తెరాస మండల అధ్యక్షుల ఎంపిక
రాష్ట్రంలో అమలులో ఉన్న సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వీలుగా తెరాస పార్టీ మండల అధ్యక్షులను ఎంపిక చేసింది. నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలోని అధ్యక్షులుగా ఎంపికైన వారికి ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అభినందనలు తెలిపారు.
నర్సాపూర్‌లో తెరాస మండల అధ్యక్షుల ఎంపిక