Edupayala Temple Controversy మెదక్ బీఆర్ఎస్లో విబేధాలు.. అమ్మవారి సమక్షంలో తడిబట్టలతో ప్రమాణాలు Edupayala Temple Controversy :మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల(Edupayala Controversy) వనదుర్గా భవానీమాత దేవాలయానికి సంబంధించి కోట్ల విలువైన దుర్గామాత బంగారం, వెండిని.. ఆలయ ఈవో ఇంటికి తీసుకెళ్లారనే ఆరోపణలు అధికార బీఆర్ఎస్ పార్టీలో దుమారం రేపుతోంది. ఈ సంఘటన నేపథ్యంలో ఆలయ బంగారం, వెండి తరలింపులో.. స్ధానిక ఎమ్మెల్యే భర్త దేవేందర్‌రెడ్డి పాత్ర ఉందని.. ప్రతిపక్షాలతో పాటు, సొంత పార్టీకి చెందిన కొందరు నేతలు ఆరోపిస్తున్నారు.
Edupayala Temple Controversy : ఆలయ ఈవో ఇంట్లో ఏడుపాయల అమ్మవారి బంగారం, వెండి.. విచారణ చేపట్టిన అధికారులు
Edupayala Temple Funds Controversy : ప్రతి ఏటా ఆలయానికి వస్తున్న ఆదాయ గణాంకాల్లో పారదర్శకత లేకుండా.. నిధుల వినియోగం, అవినీతికి పాల్పడుతున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేయడంతో ఈ వ్యవహారం రాజకీయరంగు పులుముకుంది. ఈ నేపథ్యంలో ఇటు దేవేందర్ రెడ్డి, అటు అసంతృప్త నేతలు పోటా పోటీగా సవాల్ విసురుకోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మొదటగా అసంతృప్త లీడర్లు చేసిన ఆరోపణలపై స్పందించిన ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి భర్త దేవేందర్‌రెడ్డి.. గురువారం ఏడుపాయల వచ్చి మంజీరా నదిలో స్నానమాచరించి తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని.. తడిబట్టలతో వనదుర్గా మాత ముందు ప్రమాణం చేశారు. తన ఎదుగుదలను చూసి ఓర్వలేకే కొంతమంది కుట్రపూరితంగా అవినీతి ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఏడుపాయల విషయంలో ముఖ్యమంత్రి తనకు ఎలాంటి చివాట్లు పెట్టలేదని స్పష్టం చేశారు.
"ఏడుపాయల విషయంలో ముఖ్యమంత్రి.. నాకు ఎలాంటి చివాట్లు పెట్టలేదు. నా ఎదుగుదలను చూసి ఓర్వలేక కొందరు ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేస్తున్నారు. ఏడుపాయలలో, బంగారం వెండి ఇతర అంశాల్లో ఎలాంటి అవినీతికి పాల్పడలేదు. తడిబట్టలతో అమ్మవారి ముందు ప్రమాణం చేస్తున్నాను".- దేవేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ నేత
Edupayala Political Issues :మరోవైపు అతనిపై ఆరోపణలు చేసిన బీఆర్ఎస్ అసమ్మతి నాయకులు.. రామాయంపేట మార్కెట్ కమిటీ మాజీ చైర్మెన్ గంగ నరేందర్, చిన్న శంకరంపేట సర్పంచ్ రాజిరెడ్డి, న్యాయవాది జీవన్‌రావ్ తదితరులు తమ మద్దతు దారులతో తరలి వచ్చి.. స్థానికి ఎమ్మెల్యే భర్తపై తాము చేసిన ఆరోపణాలన్నీ వాస్తవమని.. మంజీరా నదిలో స్నానాలు చేసి రాజ గోపురం వన దుర్గా మాత ముందు ప్రమాణం చేశారు. ఇలా ఇరు వర్గాలు ఏడుపాయల అమ్మవారి ముందు పోటా పోటీ ప్రమాణాలు చేయడంతో మెదక్ నియోజక వర్గ బీఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా ఉన్న విభేదాలు రచ్చకెక్కాయి.
"నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే భర్త దేవేందర్‌రెడ్డి అనేక భూకబ్జాలకు పాల్పడ్డారు. నిన్న వివిధ ఆరోపణలు చేస్తే.. కేవలం ఆలయ బంగారంపై మాత్రమే మాట్లాడారు. కోనాపూర్ సొసైటీలో రెండు కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని.. ఏకంగా ప్రభుత్వ అధికారే నివేదిక ఇవ్వడం జరిగింది. దేవేందర్‌రెడ్డి అవినీతి చేసినందుకు గాను సొంత గ్రామం సొసైటీ సభ్యులే పదవి నుంచి తప్పించారు". - రాజిరెడ్డి, చిన్న శంకరంపేట సర్పంచ్
Edupayala Temple Submerged : జల దిగ్బంధంలో.. ఏడుపాయల దేవస్థానం