హైదరాబాద్ ఎర్రగడ్డలో నివాసం ఉండే వీణ, శివ, రవి కుటుంబ సభ్యులు మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం ఎర్రకుంట తండాకు.. ఈ నెల 20తేదీన వివాహానికి వచ్చారు. తిరిగి వెళ్దామనుకునే సమయానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడిలో భాగంగా లాక్డౌన్ను ప్రకటించాయి. అంతే ఇంక చేసేదేమీ లేక.. ఆ ఊరిలోనే ఉండలేక.. తమ సొంతిళ్లకు చేరుకోవడానికై నానాయాతన పడుతూ నడక ప్రయాణం చేస్తున్నారు.
వివాహానికి వచ్చి. కాలినడకన తిరుగు ప్రయాణం - లాక్డౌన్ ఎఫెక్ట్
వివాహానికి వచ్చారు. తిరిగి వెళ్దామంటే వాహనాలు నడవడం లేదు. లాక్డౌన్ కారణంగా ఇళ్లకు ఎలా చేరుకోవాలో తెలియక వివాహానికి వచ్చిన అతిథులు మెదక్ నర్సాపూర్ నుంచి హైదరాబాద్ ఎర్రగడ్డకు కాలినడకన ప్రయాణం చేస్తున్నారు.
లాక్డౌన్ ఎఫెక్ట్:వివాహానికి వచ్చి. కాలినడక తిరుగుముఖం పట్టారు
కాగా నర్సాపూర్ మల్లన్న గుడి వద్ద ఉన్న పోలీస్ చెక్పోస్ట్ వద్దకు వారు చేరుకోగానే పోలీసులు వారి వివరాలు తెలుసుకుని అటుగా వచ్చిన వాహనంలో వారిని ఎక్కించి స్వస్థలాలకు పంపించారు. దయాహృదయంతో తమకు సాయం చేసిన పోలీసులకు వారు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చూడండి:కరోనాను జయించేందుకు ఇవి తెలుసుకోండి...