కేజ్ వీల్ ట్రాక్టరు రోడ్లపై నడిపించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని మెదక్ జిల్లా అదనపు జిల్లా కలెక్టర్ నగేష్ తెలిపారు. కొల్చారం మండలం నాయిని జలాల్ పూర్ గ్రామంలో రోడ్డుపై కేజ్ వీల్స్ ట్రాక్టర్‌ను నడుపుతున్నా మల్లేశం అనే వ్యక్తికి పదివేల రూపాయలు జరిమానా విధించారు.
కేజ్‌వీల్స్ ట్రాక్టర్‌తో రోడ్లపై తిరిగితే కఠిన చర్యలు: కలెక్టర్ నగేష్ - మెదక్ జిల్లా వార్తలు
మెదక్ జిల్లా కొల్చారం మండలంలో రోడ్డుపై కేజ్ వీల్స్ ట్రాక్టర్‌ను నడుపుతున్న వ్యక్తికి అదనపు జిల్లా కలెక్టర్ నగేష్ పదివేల రూపాయలు జరిమానా వేశారు. కేజ్ వీల్స్ రోడ్లపై నడపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
![కేజ్‌వీల్స్ ట్రాక్టర్‌తో రోడ్లపై తిరిగితే కఠిన చర్యలు: కలెక్టర్ నగేష్ driving with cage wheels on roads is will take strict action if : Collector Nagesh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7987388-53-7987388-1594475179386.jpg)
కేజ్ వీల్స్‌తో రోడ్లపై తిరిగితే కఠిన చర్యలు: కలెక్టర్ నగేష్
కేజ్ వీల్స్ ట్రాక్టర్‌ను రోడ్లపై నడిపిన వారికి జరిమానా, పోలీస్ కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చూడండీ:రైతుబంధు డబ్బులు తన ఖాతాకు మళ్లించుకున్నాడు