తెలంగాణ

telangana

ETV Bharat / state

నర్సాపూర్ మండలంలోని గ్రామాలకు తాగు,సాగు నీరు - Distribution of clothing for sanitation workers in Narsapur

మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలోని చిప్పల్ తుర్తి, రంజాతండా గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు.. ఎమ్మెల్యే మదన్ రెడ్డి దుస్తులు పంపిణీ చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందడం వల్ల.. అభివృద్ధి పనులు నిలిచిపోయాయని ఆయన పేర్కొన్నారు. అత్యవసర పనులను అధికారులతో మాట్లాడి అక్కడే పరిష్కారించారు.

Drinking water and drinking water for villages in Narsapur zone
కాళేశ్వరం నీటితో.. నర్సాపూర్ మండలంలోని గ్రామాలకు తాగు,సాగు నీరు

By

Published : May 21, 2020, 9:02 AM IST

కాళేశ్వరం నీటితో.. నియోజకవర్గంలోని గ్రామాలకు తాగు,సాగు నీరు అందిస్తామని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలోని చిప్పల్ తుర్తి, రంజాతండా గ్రామపంచాయతీలలో పని చేస్తున్నా పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులు పంపిణీ చేశారు. ఎంపీటీసీ సంధ్యారాణి సహకారంతో వీటిని అందజేసినట్లు వెల్లడించారు. మండలంలోని అన్ని గ్రామాల పారిశుద్ధ్య కార్మికులకు వీటిని అందించాలని ఎమ్మెల్యే సూచించారు.

కరోనా వైరస్ వ్యాప్తి చెందడం వల్ల.. అభివృద్ధి పనులు నిలిచిపోయాయని మదన్ రెడ్డి పేర్కొన్నారు. అత్యవసర పనులను అధికారులతో మాట్లాడి అక్కడే పరిష్కారించారు. కాళేశ్వరం నీటితో నియోజకవర్గంలోని గ్రామాలకు తాగు, సాగు నీరు అందించి.. పంట భూములను సస్యశ్యామలం చేస్తామని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:దూరంగా బెంచీలు... సగంమందే విద్యార్థులు

ABOUT THE AUTHOR

...view details