తెలంగాణ

telangana

ETV Bharat / state

మందెయ్యడానికి ప్రభుత్వ కార్యాలయాలే టార్గెట్​.. - మందెయ్యడానికి ప్రభుత్వ కార్యాలయాలే టార్గెట్​..

మెదక్​ జిల్లాలో నర్సాపూర్​లోని ప్రభుత్వ కార్యాలయాలనే టార్గెట్​గా చేసుకుని మందుబాబులు చెలరేగిపోతున్నారని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయాల సిబ్బందికి, ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నారని అంటున్నారు.

drinkers in medak
మందెయ్యడానికి ప్రభుత్వ కార్యాలయాలే టార్గెట్​..

By

Published : Feb 2, 2020, 1:33 PM IST

ప్రభుత్వ కార్యాలయాలే మందుబాబులకు అడ్డాగా మారాయి. రాత్రి అయ్యిందంటే చాలు కార్యాలయాల ముందున్న ఖాళీ స్థలాల్లో మద్యం సేవించి సీసాలను పగలగొట్టి వెళ్తున్నారు. మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయాల పరిస్థితి రోజురోజుకూ అధ్వాన్నంగా మారుతోంది. అటు అధికారులకు ఇటు ప్రజలకు తీవ్ర ఇబ్బందులను తెచ్చిపెడుతోంది.

రోజు ఉదయం సిబ్బంది తొలగిచి శుభ్రం చేయడం.. రాత్రి మందుబాబులు వచ్చి తాగడం ఇలా షరామామూలుగా జరుగుతూ ఉంటోందని ఆయా కార్యాలయాల సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల విద్యాధికారి, ఎంపీడీవో, పశుసంవర్థక, బీఎస్‌ఎన్‌ఎల్‌, పిల్లల పార్కు, వ్యవసాయశాఖ ఇలా మందుబాబులు ఏ కార్యాలయాన్నీ వదలడంలేదు.

ఇప్పటికైనా అధికారులు స్పందించి రాత్రి సమయంలో ఇక్కడ పోలిస్​ పెట్రోలింగ్‌ చేయాలని ఆయా కార్యాలయాల అధికారులు, సిబ్బంది కోరుతున్నారు.

మందెయ్యడానికి ప్రభుత్వ కార్యాలయాలే టార్గెట్​..

ఇదీ చూడండి: అటవీ ప్రాంతంలో ఓ ప్రేమజంట ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details