తెలంగాణ

telangana

ETV Bharat / state

టీఎన్జీవో మెదక్ జిల్లా అధ్యక్షుడిగా దొంత నరేందర్ - మెదక్​ జిల్లా టీఎన్జీవో వార్తలు

మెదక్​ జిల్లా టీఎన్జీవోకు నూతన అధ్యక్షుడిగా దొంత నరేందర్ ఎన్నికయ్యారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్​లో జరిగిన సమావేశంలో కార్యవర్గ సభ్యుల మధ్య ఈ ఎన్నిక జరిగింది.

Donta Narender is elected   new president of  medak district tngo
జిల్లా టీఎన్జీవో నూతన అధ్యక్షుడిగా దొంత నరేందర్

By

Published : Dec 30, 2020, 7:11 PM IST

తెలంగాణ నాన్‌గెజిటెడ్‌ అధికారుల (టీఎన్జీవో) మెదక్ జిల్లా నూతన అధ్యక్షుడిగా దొంత నరేందర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత అధ్యక్షుడు మేడిశెట్టి శ్యామ్ రావు పదవీ విరమణ చేయడంతో జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్​లో జరిగిన టీఎన్జీవో జిల్లాకార్యవర్గ సమావేశం జరిగింది. కార్యవర్గం నరేందర్​ను ఏకగ్రీవంగా ఎన్నుకుంది.

మెదక్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్​లో బుధవారం జరిగిన టీఎన్జీవో జిల్లాకార్యవర్గ సమావేశంలో కొత్త అధ్యక్షున్ని ఎన్నుకోవడంతోపాటుగా నూతన కార్యవర్గాన్ని ఆ సంస్థ సభ్యులు ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన నరేందర్ తన ఎన్నికకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. టీఎన్జీవో సంఘాన్ని బలోపేతం చేయడంతోపాటు ఉద్యోగుల అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. నరేందర్ ప్రస్తుతం ఇరిగేషన్ డివిజన్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు.

ఇదీ చదవండి:లెక్కలు తారుమారు- భాజపా బేజారు

ABOUT THE AUTHOR

...view details