కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో.. ప్రభుత్వం లాక్డౌన్ విధించడం వల్ల మెదక్ జిల్లాలో చాలా మంది ఉపాధి కోల్పోయారు. పేదల ఆకలి తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తోంది. ఇప్పటి వరకు రెండు విడతలుగా కార్డు దారులతో పాటు కుటుంబసభ్యుల్లో ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం కుటుంబానికి రూ. 1500లు కూడా అందజేశారు.
ఈసారి నగదు పంపిణీ బందు
మూడో విడత కూడా 12 కిలోల బియ్యం, రెండు కిలోల కందిపప్పును డీలర్లు ప్రజలకు అందజేస్తున్నారు. ఈసారి నగదు మాత్రం ఇవ్వడం లేదు. కేంద్ర ప్రభుత్వం గత నెలలో ఒక కిలో కందిపప్పు ఇవ్వగా.. ఈ నెలలో రెండు కిలోలు ఇస్తున్నారు.