ఈనెల 17న ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని రోజుకో కార్యక్రమం చేపట్టనున్నట్లు మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ భాజపా ఇంఛార్జీ సింగాయిపల్లి గోపీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలోని వైద్యులకు పీపీఈ కిట్లు, రోగులకు పండ్లు పంపిణీ చేశారు.
భాజపా ఆధ్వర్యంలో వైద్యులకు పీపీఈ కిట్ల అందజేత - మెదక్ జిల్లా నర్సాపూర్ తాజా వార్తలు
మెదక్ జిల్లా నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలోని వైద్యులకు భాజపా ఆధ్వర్యంలో పీపీఈ కిట్లు అందజేశారు. ఈ సందర్భంగా రోగులకు పండ్లను పంపిణీ చేశారు. ఈనెల 17న ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా రోజుకో కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.
భాజపా ఆధ్వర్యంలో వైద్యులకు పీపీఈ కిట్ల అందజేత
భాజపా ఆధ్వర్యంలో రేపు ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తామని గోపీ పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కౌన్సిలర్ సంగసాని సురేశ్, రమేష్ గౌడ్, మానయ్య తదితరులు పాల్గొన్నారు.
ఇదీచూడండి..రావిరాలలో మెగా డెయిరీ... ఏర్పాట్లన్నీ పూర్తి: తలసాని