సీఎం సహాయనిధి చెక్కులను కేసీఆర్ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మెదక్ నియోజకవర్గంలో అనారోగ్యానికి గురై.. ఉన్నత వైద్యసేవలు పొందిన వివిధ మండలాలకు చెందిన 25 మంది లబ్ధిదారులకు తన క్యాంపు కార్యాలయంలో చెక్కులు అందించారు. సహాయ నిధి ద్వారా రూ. 16 లక్షల 34 వేల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించారు.
లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ - telangana nes
సీఎం సహాయనిధి ద్వారా లబ్ధిదారులకు కేసీఆర్ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి చెక్కులను పంపిణీ చేశారు. 25 మంది లబ్ధిదారులకు రూ. 16 లక్షల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించారు.
లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ
పేద, మధ్యతరగతి ప్రజలు అనారోగ్యాలకు గురై ఉన్నత వైద్యం పొందిన వెంటనే సహాయనిధి ద్వారా ఆసుపత్రి ఖర్చులను అందిస్తున్నామని శేరి సుభాష్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రైతు బంధు సమితి అధ్యక్షులు సోములు, ఎంపీపీలు శేరి నారాయణ రెడ్డి, భాగ్యలక్ష్మి గోపాల్ రెడ్డి, ఎంపీటీసీ సిద్ద రామిరెడ్డి, సర్పంచులు, తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:'ఎన్నికలు జరగాల్సిందే... మీ యుద్ధంలో మేం భాగస్వామ్యం కాబోము'