తెలంగాణ

telangana

ETV Bharat / state

చేగుంటలో కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో కూరగాయల పంపిణీ - DISTRIBUTION OF GROCERIES BY BJYM IN CHEGUNTA MEDAK DISTRICT

మెదక్ జిల్లాలోని దుబ్బాక నియోజకవర్గంలో భారతీయ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ చేశారు. బీజేకేఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వలస కార్మికులకు సరకులు అందించారు.

వలస కూలీలకు కూరగాయల అందజేత
వలస కూలీలకు కూరగాయల అందజేత

By

Published : Apr 13, 2020, 5:21 PM IST

మెదక్ జిల్లా చేగుంట మండలంలో వలస కార్మికులకు కూరగాయలు అందజేశారు. దుబ్బాక నియోజకవర్గం చేగుంట మండలం గొల్లపల్లి గ్రామంలో కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు తోట కమలాకర్ రెడ్డి సరకులను పంపిణీ చేశారు. లాక్ డౌన్ వల్ల ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కమలాకర్ రెడ్డి అన్నారు. ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో చేతనైన సహాయం చేయాలని సూచించారు. అందరూ స్వీయ నిర్బంధం తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు విభూషణ్ రెడ్డి, గొల్లపల్లి గ్రామ సర్పంచ్ ఎల్లారెడ్డి, ముక్క పల్లి రాజు, పరమేష్ , భూపాల్, సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details