కరోనా సమయంలో పారిశుద్ధ్య కార్మికులు అందించిన సేవలు వెలకట్టలేనివని రెస్సాన్సిబుల్ సిటిజన్స్ సంస్థ అధ్యక్షుడు వడ్డి బాబురావు పేర్కొన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ పురపాలికలో పనిచేస్తోన్న 60 మంది పారిశుద్ధ్య కార్మికులకు శానిటైజర్, మాస్క్, నిత్యావసరాలను పంపిణీ చేశారు.
కరోనా విజృంభిస్తున్న సమయంలోనూ పారిశుద్ధ్య కార్మికులు నిత్యం విధులకు హాజరవుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతున్నారని బాబురావు పేర్కొన్నారు. కరోనా వచ్చిన వీధుల్లో సైతం ఏమాత్రం జంకకుండా రసాయనాలు పిచికారీ చేస్తున్నారని తెలిపారు. వారి సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. విధుల్లో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.