తెలంగాణ

telangana

ETV Bharat / state

డయాలసిస్​ కేంద్రంలో నిలిచిన సేవలు... రోగుల అవస్థలు - మెదక్​ జిల్లా వార్తలు

మెదక్​ ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలోని డయాలసిస్​ కేంద్రంలో వర్షానికి పెచ్చులూడి పైకప్పు ఊడిపడింది. విద్యుత్​ సరఫరా నిలిచిపోవడం వల్ల డయాలసిస్​ సేవలు నిలిచిపోయాయి. ఇబ్బంది పడుతున్నామని డయాలసిస్​ సేవలు రోగులు అదనపు కలెక్టర్​ నాగేష్​కు ఫిర్యాదు చేశారు. డయాలసిస్ కేంద్రానికి వెళ్లి పరిస్థితిని పరిశీలించిన అదనపు కలెక్టర్​ నాగేష్​... సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

dialysis services stopped in medak governt hospital
డయాలసిస్​ కేంద్రంలో నిలిచిన సేవలు... రోగుల అవస్థలు

By

Published : Aug 17, 2020, 8:50 PM IST

మెదక్ ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలోని డయాలసిస్ కేంద్రంలో రోగుల పరిస్థితి గాలిలో దీపంలా మారింది. వర్షానికి పెచ్చులూడి పడి పైకప్పు ఊడిపడింది. బెడ్ల మీద వర్షపు నీరు పడుతోంది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడం వల్ల డయాలసిస్ సేవలు నిలిచిపోయాయి. గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షానికి నీరు డయాలసిస్ కేంద్రంలోకి వస్తోందని, విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయిందని రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జనరేటర్ ఉన్నా వినియోగించడం లేదని... డయాలసిస్ కేంద్రం వద్ద కూర్చునే వసతి కూడా లేకపోవడం వల్ల వర్షంలో తడుస్తూ ఇబ్బంది పడుతున్నామని డయాలసిస్ రోగులు అదనపు కలెక్టర్ నాగేష్​కు ఫిర్యాదు చేశారు..
స్పందించిన అదనపు కలెక్టర్ నాగేశ్ వెంటనే డయాలసిస్ కేంద్రానికి వెళ్లి పరిస్థితిని పరిశీలించి... డయాలసిస్ రోగులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. డయాలసిస్ కేంద్రం దుస్థితిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే విద్యుత్తు సరఫరా పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు. వర్షానికి కురవకుండా ప్రత్యామ్నాయంగా టార్పాలిన్ కవర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. డయాలసిస్ సెంటర్​లో కొన్ని ఇబ్బందులు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు.. గత రెండు, మూడు రోజులుగా డయాలసిస్ కేంద్రంలో విద్యుత్ సరఫరా లేదని... అలాగే వర్షం వల్ల నీళ్లు వచ్చాయన్నారు. డయాలసిస్ కేంద్రం కోసం కొత్త భవనం నిర్మించేందుకు గతంలోనే ఉన్నతాధికారులకు, వైద్య శాఖకు ప్రతిపాదనలు పంపామని తెలిపారు. ప్రస్తుతం తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని అన్నారు. డయాలసిస్ కేంద్రంలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

ఇవీ చూడండి:ఫ్లడ్ మేనేజ్‌మెంట్ ఆఫ్ తెలంగాణ పాలసీ తయారుకావాలి: కేసీఆర్​

ABOUT THE AUTHOR

...view details