మెదక్ జిల్లాలోని పలు దేవాలయాల్లో ధనుర్మాస ప్రారంభ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి, కోదండ రామస్వామి, రామాయంపేట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో ఉదయం ఆస్థాన సేవ జరిగింది. అనంతరం ఉత్సవ విగ్రహాలను ఊరేగించారు. పండితులు ధనుర్మాసం విశిష్టతను తెలియజేశారు. ధనుర్మాసం విష్ణువుకు ప్రీతికరమైన మాసమని... వ్రతం చేపట్టిన అవివాహితులకు పెళ్లి జరుగుతుందనే నమ్మకం కలదని వివరించారు. ధనుర్మాసము అంటే దివ్య ప్రార్థనకు అనువైన మాసం అని తెలిపారు.
మెదక్ జిల్లాలో ఘనంగా ధనుర్మాస ఉత్సవాలు
మెదక్ జిల్లాలోని పలు ఆలయాల్లో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రత్యేక పూజల అనంతరం పండితులు ఈ మాసం ప్రత్యేకతను వివరించారు. ఉత్సవ విగ్రహాలను ఊరేగించారు.
మెదక్ జిల్లాలో ఘనంగా ధనుర్మాస ఉత్సవాలు
ఈ మాసంలో ఇంటిని శుభ్రం చేసి దీపారాధన చేయడం వల్ల మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుందని అర్చకులు వెల్లడించారు. అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని... విష్ణు ఆలయంలో ఉదయం అర్చన, పాశురం నివేదన, తర్వాత ప్రసాదాన్ని నివేదించి వాటిని పిల్లలకు పంచాలని తెలిపారు. దీన్నే బాల భోగము అంటారన్నారు. సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే వరకు అంటే భోగి రోజు వరకు ధనుర్మాసం కొనసాగుతుందని తెలిపారు.
ఇదీ చదవండి:కూర్మ అవతారంలో భద్రాద్రి రామయ్య