భారత్ బంద్‌కు సంపూర్ణ మద్దతునిస్తూ మెదక్ ఆర్టీసీ డిపో ముందు సీపీఎం, కాంగ్రెస్ నాయకులు నిరసన చేపట్టారు. రైతు వ్యతిరేక చట్టాలను కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయిలో రైతులను ఆదుకుందని.. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వారిని విచ్ఛిన్నం చేసిందని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మామిళ్ల ఆంజనేయులు ఆరోపించారు.
మెదక్ ఆర్టీసీ డిపో ముందు సీపీఎం, కాంగ్రెస్ నిరసన - భారత్ బంద్ వార్తలు
భారత్ బంద్‌లో భాగంగా మెదక్ ఆర్టీసీ డిపో ముందు సీపీఎం, కాంగ్రెస్ నాయకులు నిరసన చేపట్టారు. దిల్లీలో నిరసన చేపడుతున్న రైతు సంఘాలకు తాము సంపూర్ణ మద్దతునిస్తున్నట్లు నాయకులు ప్రకటించారు. అన్నదాతలకు నష్టం కలిగించే వ్యవసాయ చట్టాలను కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
మెదక్ ఆర్టీసీ డిపో ముందు సీపీఎం, కాంగ్రెస్ నిరసన
బీఎస్ఎన్ఎల్, రైల్వే, టెలికాం అనేక సంస్థలను కార్పొరేట్ రంగాలకి ధారాదత్తం చేసినట్టే వ్యవసాయ రంగాన్ని కూడా మోదీ ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్నారని ఆంజనేయులు విమర్శించారు. ఈ చట్టాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.