నిరుపేదలు, కూలీలకు ఆర్థిక సాయం చేయాలని మెదక్ జిల్లా కేంద్రంలో సీపీఎం ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేశారు. లాక్డౌన్ నేపథ్యంలో పేదలు, కార్మికులు తిండికి తిప్పలు పడుతున్నందున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.10 వేలు ఇవ్వాలని జిల్లా కార్యదర్శి మల్లేశం డిమాండ్ చేశారు. కరోనా నేపథ్యంలో మద్యం దుకాణాలు మూసేయాలని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని కోరారు. ప్రతి కుటుంబానికి నెలకు రూ.7500 ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి, సభ్యులు బాలమని, నర్సమ్మ, జిల్లా కమిటీ నేతలు లచ్చా గౌడ్, సంతోష్, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.
'నిరుపేద కూలీలకు కుటుంబానికి రూ.10వేలు ఇవ్వాలి' - medak district headquarter
సీపీఎం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మెదక్ జిల్లా కేంద్రంలోని కేవల్ కిషన్ భవన్లో కూలీలు, నిరుపేదల సమస్యలు పరిష్కరించాలని నిరసన దీక్షలు చేపట్టారు. లాక్డౌన్ కొనసాగుతోన్న నేపథ్యంలో పేదలకు సరుకులు, ఆర్థిక సహాయం తక్షణమే అందించాలని డిమాండ్ చేశారు.
'పేదలకు సరుకులు, ఆర్థిక సహాయం తక్షణమే అందించాలి'