కరోనా మహమ్మారి గొలుసు తెంచే ఉద్దేశంతో విధించిన లాక్‌డౌన్‌తో కొందరు అభాగ్యుల బతుకులు ఆగమవుతున్నాయి. ఏ దిక్కూ లేనివారు రోడ్డున పడుతున్నారు. దాతలు ఇచ్చే ఆహారంతోనే కడుపు నింపుకోవాల్సిన దైన్యం నెలకొంది. మెదక్ జిల్లా మాచవరం గ్రామానికి చెందిన పద్మకు ముగ్గురు పిల్లలు. ఈమె సంగారెడ్డిలో బస్టాండ్లను శుభ్రం చేస్తూ ఉపాధి పొందేవారు. లాక్‌డౌన్ కారణంగా ఆ పని లేకుండాపోయింది. ప్రస్తుతం బస్టాండ్ పరిసరాల్లోనే పిల్లలతో కాలం వెళ్లదీస్తున్నారు. ఒక్క పొట్లం మాత్రమే దొరకడంతో ఆ తల్లి మొదట తన పిల్లలకే తినిపించారు.
లాక్‌డౌన్‌తో ఉపాధి కరవాయె.. పిల్లలకు పట్టెడన్నం వరమాయె.! - corona pandemic killing the families lives
కరోనా మొదటి దశ తర్వాత కేసులు తగ్గుముఖం పట్టడంతో సాధారణ జీవనానికి మెల్లమెల్లగా అలవాటు పడుతున్న ప్రజలను.. రెండో దశ కోరలు చాచి కాటేస్తోంది. మధ్య తరగతి బతుకులే అంతంత మాత్రంగా ఉంటే ఇక కూలీ దొరికితే గాని పూట గడవని బతుకుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. లాక్‌డౌన్‌తో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. తమకు లేకపోయినా తమ పిల్లలకు పట్టెడన్నం దొరికితే చాలని బాధపడుతున్నారు. మెదక్ జిల్లాలోని అలాంటి ఇద్దరు తల్లుల పరిస్థితి దయనీయంగా మారింది.
కరోనాతో కష్టమైన కుటుంపోషణ
పెద్దశంకరంపేటకు చెందిన లక్ష్మి తన ఇద్దరు చిన్నారులతో నాలుగు రోజులుగా బస్టాండ్ ఆవరణలోనే ఉంటున్నారు. భర్త మృతి చెందాడు. కూలి పనులు చేసుకుని బతికేవారు. లాక్‌డౌన్‌లో పనులు లేక ఇబ్బందులు పడుతున్నట్లు ఆమె తెలిపారు.
ఇదీ చదవండి:'గర్భిణీలకు కరోనా సోకినా.. లోపల ఉన్న బిడ్డకు రాదు'
Last Updated : May 19, 2021, 9:02 AM IST