మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో కరోనా వ్యాప్తి ఉద్ధృతంగా ఉంది. మంగళవారం నర్సాపూర్ పట్టణంలో 13, మండల వ్యాప్తంగా 03 మొత్తం 16 కేసులు నమోదయ్యాయి. శివ్వంపేటలో 04, కౌడిపల్లిలో 07, వెల్దుర్థిలో 10 మంది వైరస్ బారిన పడ్డారు.
నర్సాపూర్‌లో వేగంగా విస్తరిస్తున్న కరోనా
నర్సాపూర్ నియోజకవర్గంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కరోనా కట్టడి కోసం పురపాలక, గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో శానిటైజేషన్ పనులు చేపట్టారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
నర్సాపూర్‌లో వేగంగా విస్తరిస్తున్న కరోనా
తాజాగా నాగ్సానిపల్లికి చెందిన వృద్ధుడు కరోనాతో గాంధీలో సోమవారం మృతి చెందాడు. భుడిరంపేటకు చెందిన మాజీ సర్పంచ్ మంగళవారం కన్నుమూసింది. కేసులు సంఖ్య పెరగడం వల్ల స్థానికంగా ఆందోళన నెలకొంది. అధికారులు గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు, శానిటైజేషన్ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.