మెదక్ జిల్లా నర్సాపూర్ ఎంపీడీవో కార్యాలయంలో కొవిడ్- 19 అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇటీవల పండుగలు జరగగా కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉందని జడ్పీ సీఈవో లక్ష్మీబాయి అన్నారు. గ్రామాల్లో దగ్గు, జలుబు, జ్వరం ఉంటే వారిని గమనించి వెంటనే పరీక్షలు చేయించుకోమని చెప్పాలని సూచించారు. మాస్కులు, శానిటైజర్, భౌతికదూరం పాటించాలని చెప్పాలని పేర్కొన్నారు. వైరస్ గురించి వారికి వివరించాలని కోరారు. వివాహాలు, విందులు, పుట్టినరోజు వేడుకలు తక్కువ మందితో జరుపుకోవాలని సూచించారు.
నర్సాపూర్‌లో కొవిడ్ అవగాహన కార్యక్రమం - మెదక్ జిల్లా లేటెస్ట్ వార్తలు
నర్సాపూర్ ఎంపీడీవో కార్యాలయంలో కరోనా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వైరస్ గురించి గ్రామస్థులకు వివరించాలని జడ్పీ సీఈవో లక్ష్మీబాయి కోరారు.

నర్సాపూర్‌లో కొవిడ్ అవగాహన కార్యక్రమం
ఈ కార్యక్రమంలో అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది, డాక్టర్ పద్మావతి, సుగుణకర్, మంగ, సూపర్వైజర్ వసంత, ప్రమీలరాణి, ఐసీడీఎస్ సూపర్వైజర్ అంజమ్మ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:సన్న రకం వరి పంటకు మద్దతు ధర ప్రకటించాలని రాస్తారోకో