తెలంగాణ

telangana

ETV Bharat / state

రెండు జిల్లాలను కలిపేందుకు వంతెన నిర్మాణం.. అప్రోచ్​ రోడ్డు పూర్తికాక నిరుపయోగం.. - మంజీరా నదిపై వంతెన

మెదక్‌, కామారెడ్డి జిల్లాలను కలిపేందుకు మంజీరా నదిపై నిర్మించిన వంతెన నిరుపయోగంగా మారింది. ఏడాది క్రితమే బ్రిడ్జి నిర్మాణం పూర్తైంది. అప్రోచ్‌ రోడ్డు పూర్తి కాకపోవటంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని... పాపన్నపేట, నాగిరెడ్డిపేట మండలాల ప్రజలు కోరుతున్నారు.

Construction of bridge to connect the two districts but bridge is unusable due to the unfinished approach road
Construction of bridge to connect the two districts but bridge is unusable due to the unfinished approach road

By

Published : Feb 22, 2022, 5:12 AM IST

రెండు జిల్లాలను కలిపేందుకు వంతెన నిర్మాణం.. అప్రోచ్​ రోడ్డు పూర్తికాక నిరుపయోగం..

మంజీరా నదికి ఇవతలి వైపు మెదక్ జిల్లాలోని పాపన్నపేట మండలం, అవతలి వైపు కామారెడ్డి జిల్లాలోని నాగిరెడ్డిపేట మండలం ఉన్నాయి. ఈ రెండు మండలాల పరిధిలోని గ్రామాలు... తక్కువ దూరంలోనే ఉన్నా.. ఇక్కడి వారు అక్కడికి, అక్కడివారు ఇక్కడికి రాలేని పరిస్థితి. వర్షకాలంలో చుట్టూ తిరిగి ఎల్లారెడ్డి, మెదక్‌‌ మీదుగా 50 నుంచి 60 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది.

రెండు జిల్లాలను అనుసంధానిస్తూ మంజీరా నదిమీద బ్రిడ్జి నిర్మించాలనే డిమాండ్‌‌ దశాబ్దాల కాలంగా ఉంది. రాష్ట్రం ఏర్పడ్డాక వంతెన నిర్మాణానికి మోక్షం లభించింది. 2017లో బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం 22 కోట్లు మంజూరు చేసింది. 2018లో పాపన్నపేట మండలం రాంతీర్థం, నాగిరెడ్డిపేట మండలం వెంకాయపల్లి మధ్య బ్రిడ్జి నిర్మాణ పనులు మొదలయ్యాయి. ఏడాది కిందట బ్రిడ్జి నిర్మాణం పూర్తైంది. తాండూర్‌‌ మీదుగా ఎల్లారెడ్డి మెయిన్‌‌ రోడ్డు వరకు బీటీ రోడ్డు నిర్మాణ పనులు పూర్తయ్యాయి. రాంతీర్థం బ్రిడ్జి దగ్గర నుంచి పాపన్నపేట వరకు 4.4 కిలోమీటర్ల అప్రోచ్ రోడ్డు నిర్మాణం చేపట్టాల్సి ఉంది.

రెండు జిల్లాల వారధిని అందుబాటులోకి తీసుకురావాలని కోరుతూ ఎమ్మెల్యేలు, మంత్రులకు వినతిపత్రాలు ఇచ్చినా.. ఫలితం లేకుండా పోయిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details