పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై మెదక్‌లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన నిరసన ప్రదర్శనలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఎడ్ల బండి పైనుంచి జారి కిందపడ్డారు. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో ఎద్దులు బెదరడంతో అదుపుతప్పి కింద పడిపోయారు. ఈ ఘటనలో రాజనర్సింహ మోకాలికి స్వల్ప గాయమైంది. వైద్యులు ఆయనకు చికిత్స అందించారు.
కాంగ్రెస్ నిరసన ప్రదర్శనలో అపశ్రుతి.. ఎడ్లబండిపై నుంచి జారిపడిన దామోదర - telangana varthalu
14:09 July 12
కాంగ్రెస్ నిరసన ప్రదర్శనలో అపశ్రుతి
ఏఐసీసీ పిలుపు మేరకు ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా పెట్రో ధరల పెంపుపై నిరసన కార్యక్రమాలు చేపట్టాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఉమ్మడి జిల్లాల వారీగా పార్టీ ఇన్‌ఛార్జీలను నియమించింది. అన్ని జిల్లా కేంద్రాల్లో సైకిళ్లను, రిక్షాలను, ఎడ్లబండ్లను ఉపయోగించి నిరసన ప్రదర్శనలు చేపట్టేలా కార్యాచరణను ప్రకటించారు. ఈ నేపథ్యంలో మెదక్‌లో ఎద్దుల బండితో కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర రాజనర్సింహ నిరసన ప్రదర్శన చేపట్టారు. మైక్ అందుకుని ఆయన ప్రసంగిస్తున్న సమయంలో ఆ శబ్ధానికి ఎద్దులు బెదరడం వల్ల అదుపు తప్పి కిందపడిపోయారు. స్వల్ప గాయాలు కావడంతో కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు.
మరోవైపు హుజూరాబాద్ ఉప ఎన్నికపైనా పీసీసీ ప్రత్యేక దృష్టిసారించింది. ఈ ఎన్నిక బాధ్యతలను కూడా పీసీసీ ఎన్నికల కమిటీ ఛైర్మన్ దామోదర్ రాజనర్సింహకు అప్పగించారు.
ఇదీ చదవండి: CONGRESS PROTEST: సీఎం మీటింగ్లు పెట్టొచ్చు... మేము ధర్నా చేయకూడదా?