మెదక్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. పదవి కోసం కాకుండా.. ప్రగతి కోసం పాటుపడాలని యూత్ కాంగ్రెస్ నాయకుడు భారత్ గౌడ్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని రాందాస్ చౌరస్తా వద్ద పద్మాదేవేందర్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
పదవి కోసం కాదు.. ప్రగతి కోసం పాటుపడాలి: కాంగ్రెస్ నాయకులు - medak constituency news
మెదక్ నియోజకవర్గంలో ఏడేళ్లుగా ఎటువంటి అభివృద్ధి జరగలేదని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ఎమ్మెల్యేగా పద్మాదేవేందర్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు.
![పదవి కోసం కాదు.. ప్రగతి కోసం పాటుపడాలి: కాంగ్రెస్ నాయకులు congress fires on medak mla padma devendar reddy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9191865-713-9191865-1602813274139.jpg)
కాంగ్రెస్ నాయకులు
మూడ్రోజులుగా కురుస్తున్న వర్షాలకు రహదారులపై గుంతలు ఏర్పడ్డాయని తెలిపారు. ఏడేళ్లుగా అధికారంలో ఉన్నా రహదారుల మరమ్మతుపై ఎలాంటి సమీక్ష నిర్వహించలేదని మండిపడ్డారు. ఇకనైనా నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించాలని హితవు పలికారు.