కుటుంబ కలహాలతో భర్తతో గొడవపడి.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో.. కుమార్తె, కుమారుడితో భార్య వెళ్లి పోయిన సంఘటన మెదక్ జిల్లా చిన్న శంకరం పేట మండలంలో చోటు చేసుకుంది. గజగట్ల పల్లి గ్రామానికి చెందిన ముత్తగారి నవనీతకు ఆమె భర్తకు మధ్య కుటుంబ విషయాల్లో తరుచూ ఘర్షణలు జరుగుతున్నాయి. ఈనెల 21న కూడా భార్యాభర్తలిద్దరూ గొడవకు దిగారు. భర్త బయటకు వెళ్లగానే.. ఎవరూ లేని సమయం చూసి భార్య నవనీత తన ఇద్దరు పిల్లలను తీసుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోయింది.
భర్తతో గొడవ-పిల్లలతో సహా భార్య అదృశ్యం - మెదక్ లో కుటుంబ కలహాలతో పిల్లలతో కలిసి అదృశ్యమైన తల్లి
కుటుంబ కలహాలు ఆ భార్యాభర్తల మధ్య దూరాన్ని పెంచాయి. సర్దుకుపోయి పిల్లలతో సరదాగా ఉండాల్సిన ఆలుమగలు గొడవలతో కాపురం చేయడం మొదలయ్యింది. చివరికి ఇద్దరి మధ్య జరిగిన గొడవతో పిల్లలతో సహా భార్య కనిపించకుండా పోయింది.
భర్తతో గొడవ-పిల్లలతో సహా భార్య అదృశ్యం
తమ కుమార్తె నవనీత తన పిల్లలతో సహా కనిపించడం లేదంటూ ఆమె తల్లి లలిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. నవనీత, ఆమె పిల్లల ఆచూకీ తెలిసిన వారు శంకరంపేట ఎస్ఐ-9490617053, రామాయంపేట- సీఐ9490617018 నెంబర్లకు సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు.
ఇవీ చదవండి: చెరుకుతోటలో చిరుతపులి పిల్లలు.. భయందోళనలో ప్రజలు