మెదక్ జిల్లా కలెక్టరేట్లో జడ్పీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. జడ్పీ ఛైర్పర్సన్ ర్యాకల హేమలత అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృతికి సంతాపం తెలిపారు. అనంతరం రెండు నిమిషాలు మౌనం పాటించారు. తెలంగాణ ప్రజలు ప్రణబ్ ముఖర్జీని ఎప్పటికి గుర్తుంచుకుంటారని ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి అన్నారు.
ప్రత్యేక రాష్ట్రానికి నాంది..
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నాంది పలికారన్నారు. దేశానికి ప్రణబ్ చేసిన సేవలు మరువలేనివని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. ఆయన అంచెలంచెలుగా ఎదుగి రాష్ట్రపతి అయ్యారన్నారు. ఆయన సేవలకు ప్రతిఫలంగా భారతరత్న అందుకున్నారని ఎమ్మెల్యే గుర్తు చేశారు.