తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రిన్సిపాల్​ను సస్పెండ్ చేయాలని ప్రజావాణిలో ఆందోళన - ప్రజావాణి

మెదక్​లోని మినీ గురుకుల ప్రధానోపాధ్యాయురాలిని విధుల్లోంచి తొలగించాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాల నాయకులు ప్రజావాణిలో ఆందోళన చేశారు. సోమవారం నాడు సమీకృత కలెక్టరేట్​లో నిరసన వ్యకం చేశారు.

ప్రిన్సిపాల్​ను సస్పెండ్ చేయాలని ప్రజావాణిలో ఆందోళన

By

Published : Aug 20, 2019, 12:02 AM IST

ప్రిన్సిపాల్​ను సస్పెండ్ చేయాలని ప్రజావాణిలో ఆందోళన
తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా బాలికల జుట్టు కత్తిరించిన మెదక్​ మినీ గురుకుల ప్రిన్సిపాల్​ను సస్పెండ్ చేయాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాలు సంయుక్తంగా ఆందోళనకు దిగారు. సోమవారం సమీకృత కలెక్టరేట్​లో ప్రజావాణి జరుపుతుండగా ఆ సంఘాల నాయకులు అక్కడికి తరలి వచ్చి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. గురుకుల ప్రిన్సిపాల్ అరుణ రెడ్డిపై చర్యలు తీసుకోవడంలో జాప్యం ఎందుకని అధికారులను నిలదీశారు. ఆమెను విధుల నుంచి తొలగించే వరకు అక్కడి నుంచి కదలమని భీష్మించారు. దీనిపై సంయుక్త కలెక్టర్​ నాగేశ్​కు వినతిపత్రం అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details