ధరణి సేవలు చాలా సులభతరమని అన్ని సక్రమంగా ఉంటే కేవలం పదిహేను నిమిషాల్లో కొనుగోలు-అమ్మకం లావాదేవీలు జరుపుకుని డాక్యుమెంటేషన్ పొందవచ్చని మెదక్ జిల్లా కలెక్టర్ హనుమంత రావు అన్నారు. ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శివ్వంపేట తహసీల్ధార్ కార్యాలయంలో ధరణి పోర్టల్ సేవలను ఆయన పరిశీలించారు.
15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది: మెదక్ కలెక్టర్
ధరణి సేవలను జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మెదక్ జిల్లా కలెక్టర్ హనుమంతరావు కోరారు. శివ్వంపేటలోని తహసీల్దార్ కార్యాలయంలో జరుగుతున్న రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ఆయన పరిశీలించారు.
15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది: మెదక్ కలెక్టర్
దళారీల ప్రమేయం లేకుండా సులభంగా డాక్యుమెంటేషన్ పూర్తి చేయడానికే ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ధరణి ద్వారా సులభంగా ఏక కాలంలో రిజిస్ట్రేషన్- మ్యుటేషన్ జరుపుకోవచ్చని తెలిపారు.
ఇదీ చూడండి:నూతన వ్యవసాయ చట్టంతో రైతులకే మేలు: ఎంపీ అర్వింద్