రైతు వేదికలను నాణ్యత ప్రమాణాలతో నిర్మించాలని మెదక్ జిల్లా కలెక్టర్ హనుమంత రావు ఇంజినీర్ అధికారులను ఆదేశించారు. రైతులను సంఘటితం చేసి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన కలిగించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతు వేదికలను నిర్మిస్తున్నదని తెలిపారు. అలాంటి వేదికల నిర్మాణ పనుల్లో అలసత్వం ప్రదర్శించవద్దని, నాణ్యత ప్రమాణాలు లోపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.
ఆశించిన మేరకు అభివృద్ధి పనులు జరగడం లేదు: మెదక్ జిల్లా కలెక్టర్ - మెదక్ జిల్లాలోని రైతు వేదికలు తాజా వార్త
నాణ్యత ప్రమాణాలు లోపించకుండా యుద్ధ ప్రాతిపదికన రైతువేదికలు, పల్లె ప్రకృతి వనాలను పూర్తి చెయ్యాలని మెదక్ జిల్లా కలెక్టర్ హనుమంతరావు అధికారులను ఆదేశించారు. వివిధ మండలాల్లో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి పనులు నిరాశాజనకంగా ఉన్నాయని.. త్వరితగతిన పూర్తి చేయ్యాలన్నారు.
అల్లాదుర్గ్ మండలం గడిపేద్దాపూర్, ముస్లాపూర్, చిలిప్చెడ్ మండలం చిట్కూర్లలో నిర్మిస్తున్న రైతు వేదిక, పల్లె ప్రకృతి వనాల పనుల పురోగతిని పరిశీలించారు. అలాగే వరిధాన్యం కేంద్రాల్లో కొనుగోళ్ల ప్రక్రియ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు వివిధ మండలాల్లో జరుగుతున్న రైతు వేదిక, పల్లె ప్రకృతి వనాల పనులను పర్యవేక్షించిన కలెక్టర్.. పనులు ఆశించిన మేర జరగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. యుద్ద ప్రాతిపదికన నిర్మాణాలు పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని ఆయన అధికారులకు సూచించారు.
ఇదీ చూడండి:సన్నాలకు కనీస మద్దతుధర చెల్లించాలంటూ భాజపా రాస్తారోకో