మెదక్ జిల్లా నర్సాపూర్ అటవీ ప్రాంతంలో ఆరోవిడత హరితహారం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రారంభించారు. అనంతరం నర్సాపూర్ నుంచి గజ్వేల్‌కు తిరుగు ప్రయాణంలో శివంపేటలో రోడ్డుపై కాసేపు ఆగారు. స్థానిక నేతలతో మాట్లాడారు.
శివంపేట అభివృద్ధికి కేసీఆర్ సానుకూల స్పందన - 6th haritaharam program at narsapur
శివంపేట అభివృద్ధికి నిధులు కేటాయించాలని స్థానిక నేతలు కోరగా... సరే అంటూ సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. నర్సాపూర్ నుంచి గజ్వేల్‌కు తిరుగు ప్రయాణంలో శివంపేటలో రోడ్డుపై సీఎం కాసేపు ఆగారు.
శివంపేట అభివృద్ధికి కేసీఆర్ సానుకూల స్పందన
నాయకులు రమేశ్ గుప్తా, జడ్పీటీసీ మహేశ్ గుప్తా... శివంపేట అభివృద్ధికి నిధులు కేటాయించాలని సీఎంను కోరారు. సరే అంటూ... సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. సీఎం స్పందనతో నేతలు హర్షం వ్యక్తం చేశారు. సీఎం రాక సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇదీ చూడండి:హరితహారంలో కేసీఆర్.. నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్ ప్రారంభించిన సీఎం