రాష్ట్రంలో ఆరోవిడత హరితహారం మెదక్ జిల్లాలో ఆరో విడత హరితహారాన్ని లాంఛనంగా ప్రారంభించారు సీఎం కేసీఆర్. అర్బన్ ఫారెస్ట్ ప్రారంభించారు. అనంతరం నర్సాపూర్‌లో మొక్కలు నాటారు. 630 ఎకరాల్లో ఈ అర్బన్ ఫారెస్ట్ నిర్మాణం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 30 కోట్ల మొక్కలు నాటాలన్న లక్ష్యంతో ముందుకెళ్లాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి పాల్గొన్నారు.
రాబోయే తరాల కోసమే
హరితహారంలో భాగంగా ఐదేళ్లలో 182 కోట్ల మొక్కలు నాటామని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. రాబోయే తరాల కోసమే అడవుల పునరుద్ధరణను ముఖ్యమంత్రి చేపట్టారని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సీఎం సూచనల మేరకు అడవుల పునరుద్ధరణను విజయవంతం చేస్తామని తెలిపారు.
మనది ధనిక రాష్ట్రం
తెలంగాణ కచ్చితంగా ధనిక రాష్ట్రమేనని ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి స్పష్టం చేశారు. కరోనా సంక్షోభం కారణంగా ఉద్యోగులకు సగం వేతనాలు ఇచ్చినా...నెలలోనే తిరిగి కోలుకున్నామని తెలిపారు.
వదిలేదే లేదు
రాష్ట్రంలో స్మగ్లింగ్‌ను పూర్తిగా అరికడతామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. కలప దొంగల కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు.
దేశామంతా చెప్పుకోవాలి
కరోనా సంక్షోక్షంలోనూ రైతులకు అండగా ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. 3 నెలల్లో రైతువేదికల నిర్మాణం పూర్తిచేస్తామన్నారు. రైతుల శ్రేయస్సు కోసమే నియంత్రిత సాగు చేపడుతున్నామని కేసీఆర్ వెల్లడించారు. మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పంటలనే సాగుచేయాలని సూచించారు. నియంత్రిత సాగుతో అద్భుత ఫలితాలు వస్తాయని తెలిపారు. తెలంగాణ వ్యవసాయం గురించి దేశామంతా చెప్పుకోవాలని అన్నారు.
మెదక్ జిల్లాలోని గ్రామాలకు రూ.20 లక్షల చొప్పున మంజూరు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఏడు మండల కేంద్రాలకు రూ.కోటి చొప్పున మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
ఇవీ చూడండి:హరితహారంలో కేసీఆర్.. నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్ ప్రారంభించిన సీఎం