ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి సమక్షంలో ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు.
సీఎం పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటిన ఎమ్మెల్యే - సీఎం పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటిన ఎమ్మెల్యే
కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు మెదక్ జిల్లాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా జరుపుకున్నారు. ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి మార్కెట్ యార్డులో మొక్కలు నాటారు.
సీఎం పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటిన ఎమ్మెల్యే
కేటీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు యావత్ తెలంగాణాను హరిత తెలంగాణాగా మార్చేందుకు ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆమె మొక్కలు నాటారు. అనంతరం జిల్లా ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలోని రోగులకు మున్సిపల్ ఛైర్మన్ చంద్రపాల్, తెరాస కార్యకర్తలు పండ్లు పంపిణీ చేశారు.
ఇదీ చూడండి:కేసీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్, హరీశ్