సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే జగ్గారెడ్డి కలిసి మెదక్ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. అక్కడ జరుగుతున్న కొవిడ్ టెస్టులు, పాజిటివ్ వచ్చిన వారికి అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. కరోనాతో దేశం మొత్తం యుద్ధం చేస్తోందని.. ఇలాంటి సమయంలో సీఎం కేసీఆర్ ఫాంహౌస్లో దాక్కోవడం సమంజసం కాదని భట్టి విక్రమార్క ఆరోపించారు. కరోనా కట్టడి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని భట్టి అన్నారు.
ఖాళీగా ఉన్న పాఠశాలల్లో ఐసోలేషన్ సెంటర్లు ఏర్పాటు చేయాలి: భట్టి - medak government hospital inspected by clp leader bhatti vikramarka
మెదక్ ప్రభుత్వ ఆసుపత్రిని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే జగ్గారెడ్డి సందర్శించారు. అక్కడ జరుగుతున్న కొవిడ్ టెస్టులు, పాజిటివ్ వచ్చిన వారికి అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. కరోనాను కట్టడి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందంటూ భట్టి విక్రమార్క సర్కారు వైఖరిని దుయ్యబట్టారు.
జిల్లా ప్రభుత్వాసుపత్రిని సందర్శించిన భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి
ప్రతి జిల్లాలో ఖాళీగా ఉన్న పాఠశాలల్లో ఐసోలేషన్ సెంటర్ను ఏర్పాటు చేసి కొవిడ్ బాధితులకు చికిత్స అందించాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రులో సీటీ స్కానింగ్ లేకపోవడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. ప్రజలందరూ స్వీయనియంత్రణ పాటిస్తూనే కరోనా నుంచి బయటపడాలని ఆయన సూచించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీ లో చేర్చి ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని భట్టి డిమాండ్ చేశారు.