మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం రైల్వే స్టేషన్ ఎదుట అఖిల భారత సీఐటీయూ నాయకులు ధర్నా చేపట్టారు. రవాణా రంగంలో అత్యుత్తమమైన సేవలందిస్తున్న రైల్వే రంగాన్ని ప్రైవేటు శక్తులకు అప్పగించడం సరికాదంటూ నినాదాలు చేశారు. రైల్వేల ప్రైవేటీకరణను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. రైల్వేల ప్రైవేటీకరణ వల్ల కేవలం కార్మికులకే కాకుండా దేశ ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు.
రైల్వే వ్రైవేటీకరణకు నిరసనగా సీఐటీయూ ఆందోళన - citu leaders protest
రైల్వేల ప్రైవేటీకరణను ఆపాలని డిమాండ్ చేస్తూ... మెదక్ జిల్లా వడియారం రైల్వే స్టేషన్ ఎదుట సీఐటీయూ నాయకులు ఆందోళన చేపట్టారు.

రైల్వే స్టేషన్ ఎదుట సీఐటీయూ నాయకుల ఆందోళన
నరేంద్ర మోదీ అధికారం చేపట్టినప్పటి నుంచి దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు దోచి పెట్టడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. ప్రజాపోరాటం ద్వారానే మోదీ ప్రజా వ్యతిరేక విధానాల్ని ఓడించగలమని అన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు భాస్కర్, వెంకట్, బాలేష్, రైల్వే కార్మికులు పాల్గొన్నారు.
TAGGED:
citu leaders protest