తెలంగాణ

telangana

ETV Bharat / state

'జన జాగరణతో పౌరసత్వ చట్టంపై అవగాహన కల్పించాలి' - latest news on Citizenship law should be educated with public awareness

మెదక్​ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు గార్డెన్​లో భాజపా జిల్లా అధ్యక్షుడు రామ్​చరణ్ అధ్యక్షతన పౌరసత్వ చట్టంపై కార్యకర్తలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. భాజపా మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Citizenship law should be educated with public awareness
'జన జాగరణతో పౌరసత్వ చట్టంపై అవగాహన కల్పించాలి'

By

Published : Jan 5, 2020, 3:27 PM IST

పౌరసత్వ సవరణ చట్టం ఎవరికీ వ్యతిరేకం కాదని.. దేశంలో అల్ప సంఖ్యాక వర్గాల భద్రత కోసమే కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిందని భాజపా మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. మెదక్​ జిల్లా కేంద్రంలోని జీకేఆర్​ గార్డెన్​లో పౌరసత్వ సవరణ చట్టం పై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

పౌరసత్వ చట్టంపై పూర్తి అవగాహన లేక కాంగ్రెస్​, సీపీఐ, సీపీఎం పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆయన విమర్శించారు. ఈ నెల 8 నుంచి 13వ తేదీ వరకు జన జాగరణ అనే కార్యక్రమం ద్వారా పౌరసత్వ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించాలని కార్యకర్తలకు సూచించారు.

'జన జాగరణతో పౌరసత్వ చట్టంపై అవగాహన కల్పించాలి'

ఇవీచూడండి: గెలవకపోతే మంత్రి పదవి ఊడుతుంది... జాగ్రత్త..!

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details