మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం కామారం తండా పక్కన గుట్టపై చిరుత సంచరిస్తోందని.. ఆ ప్రాంతవాసులు ఎప్పటినుంచో చెబుతున్నారు. కానీ.. ఎవరూ నమ్మలేదు. చిరుత మేకలు, లేగదూడలను ఎత్తుకెళ్లి చంపి తినేసింది. అప్పటినుంచి అప్రమత్తంగా ఉన్నారు. గుట్టపై చిరుత పులి కూర్చుని ఉండగా స్థానికులు వీడియో తీశారు. ఆ వీడియో, ఫొటోలను మీడియాకు పంపారు.
అటవీశాఖ అధికారులు అక్కడ బోను ఏర్పాటు చేశారు. కానీ.. ఆ చిరుత పులి బోనులో చిక్కడం లేదు. ఇటీవల కాలంలో చిరుత పులి రెండు పిల్లలతో కలిసి ఈ ప్రాంతంలో తరచుగా కనిపిస్తుందని... ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థంకావడం లేదని.. కామారం తండావాసులు, మీర్జాపల్లి తండావాసులు చెబుతున్నారు.