తెలంగాణ

telangana

ETV Bharat / state

పుస్తెలతాడు లాక్కుని బైక్​పై పరార్​.. ఓ మహిళకు గాయాలు​​ - మెదక్​ జిల్లాలో చైన్​స్నాచింగ్​

మెదక్​ జిల్లా కొనాపూర్​ గ్రామశివారులో వాహనంపై తన భర్తతో వెళ్తున్న ఓ మహిళ మెడలోని పుస్తెలతాడుని లాక్కుని ఇద్దరు దుండగులు బైక్​పై​ పరారయ్యారు. ఈ ఘటనలో మహిళకు తీవ్రగాయాలు అయ్యాయి.

chine snatching in medak konapur
పుస్తెలతాడు లాక్కుని బైక్​పై పరార్​.. ఓ మహిళకు గాయాలు​​

By

Published : Jun 7, 2020, 6:55 PM IST

కామారెడ్డి జిల్లా బస్వాపూర్ గ్రామానికి చెందిన దంపతులు సిద్దిరామ్ రెడ్డి, రాజేశ్వరి ద్విచక్ర వాహనంపై సిద్దిపేట జిల్లా గుడికందుల గ్రామానికి వెళ్తుండగా.. మెదక్ జిల్లా కొనాపూర్ గ్రామశివారులో గుర్తుతెలియని ఇద్దరు దుండగులు చైన్​స్నాచింగ్​కు పాల్పడ్డారు. గ్లామర్ బైక్​పై వచ్చి రాజేశ్వరి మెడలోని పుస్తెలతాడు తెంచుకుని పరారయ్యారు.

ఈ దాడిలో రాజేశ్వరికి తలకు తీవ్ర గాయాలు కాగా ఆమెను సిద్దిరామ్​ రెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న రామాయంపేట పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఇవీ చూడండి: చేపల కొనుగోళ్లకు ఎగబడ్డ జనం..

ABOUT THE AUTHOR

...view details