తెలంగాణ

telangana

ETV Bharat / state

'పిల్లలు స్వేచ్ఛగా కలలు కనాలి.. వాటిని సాకారం చేసుకోవాలి' - చిల్డ్రన్స్​ డే వేడుకలు వార్తలు మెదక్​

మెదక్​లో చిల్డ్రన్స్​ డే వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిల్లలపై వేధింపుల నివారణకు సంబంధించిన పోస్టర్​ను​ ఆవిష్కరించారు. పిల్లలు ఉన్నతమైన కలలు కనాలని.. వాటిని సాకారాం చేసుకునే దిశగా కృషి చేయాలని సీఐ చందర్​ పేర్కొన్నారు. ఏమాత్రం అధైర్య పడకుండా సమస్యలను ఎదురుకోవాలన్నారు.

మెదక్​లో చిల్డ్రన్స్​ డే వారోత్సవాలు..
మెదక్​లో చిల్డ్రన్స్​ డే వారోత్సవాలు..

By

Published : Nov 19, 2020, 7:12 PM IST

దివ్య దిశ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చిల్డ్రన్స్​ డే వారోత్సవాలు మెదక్​లో నిర్వహించారు. ఇందులో భాగంగా గురువారం పిల్లలపై వేధింపుల నివారణకు సంబంధించిన పోస్టర్​ను ఆవిష్కరించారు. నేటి సమాజంలో బాలలపై లైంగిక వేధింపులు రోజు రోజుకి పెరిగి పోతున్నాయని.. వాటిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ తోడ్పడాలని మెదక్​ టౌన్​ సీఐ వెంకట్​ తెలిపారు.

బాలల వేధింపులపై అవగాహన కల్పిస్తోన్న అధికారులు

పిల్లలు ఉన్నతమైన కలలు కనాలని.. వాటిని సాకారాం చేసుకునే దిశగా కృషి చేయాలని జిల్లా క్రైమ్​ రిపోర్ట్​ బ్యూరో సీఐ చందర్​ పేర్కొన్నారు. ఏమాత్రం అధైర్య పడకుండా సమస్యలను ఎదురుకోవాలన్నారు. తమకు సంవత్సర కాలంలో ఎన్నో రకాల ఫిర్యాదులు వస్తాయని.. ఇందులో ముఖ్యంగా బాల్య వివాహాలు, లైంగిక వేధింపులు, అక్రమ దత్తత వంటివి అధికమని జిల్లా సంక్షేమ అధికారి రసూల్​ తెలిపారు. ఫిర్యాదులు మెదక్ జిల్లాలో అధికమని వీటిని చేధించడానికి డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ ఎప్పుడూ ముందుంటుందన్నారు. బాలల హక్కులకు భంగం కలిగించినా, లైంగిక వేధింపులకు గురి చేసినా.. 1098 కాల్ చేయాలని చైల్డ్ లైన్ నోడల్ కో ఆర్డినేటర్ అశోక్ సూచించారు.

వేడుకల్లో ప్రసంగిస్తున్న బాలిక

ఇదీ చదవండి:హైదరాబాద్​లో విద్వేషాలు రెచ్చగొట్టే కుట్ర.. సహించం: కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details