తెలంగాణ

telangana

ETV Bharat / state

Cheetah Attack on Calf in Medak : మెదక్ జిల్లాలో చిరుత కలకలం... లేగ దూడపై దాడి.. భయాందోళనలో గ్రామస్థులు - cheetah attack in medak

Cheetah Attack on Calf at Masayipeta : మెదక్‌ జిల్లాలో మరోసారి చిరుతపులి కలకలం రేపింది. తిమ్మాయిపల్లి గ్రామ పరిధిలో చిరుత పులి లేగ దూడపై దాడి చేసింది. విషయం తెలిసినప్పటి నుంచి గ్రామస్థులు భయపడుతున్నారు. సమాచారం అందుకున్న అటవీ అధికారులు గ్రామాన్ని సందర్శించి.. చనిపోయిన లేగదూడను పరిశీలించి గ్రామస్థులకు జాగ్రత్తలు సూచించారు.

Masayipeta Villagers Fear due to Tiger
Tiger Attack on Calf at Timmayipalli

By ETV Bharat Telangana Team

Published : Aug 27, 2023, 5:25 PM IST

Updated : Aug 27, 2023, 5:31 PM IST

Cheetah Latest Attack in Telangana: గ్రామంలో కుక్కలు తిరుగుతూ ఉంటేనే అటువైపు వెళ్లేందుకు భయపడతాం. వాటి వల్ల మనకి ఏమి హాని జరుగుతుందో అని కంగారు పడిపోతాం. మరి కొంత మంది వాటి బారి నుంచి తప్పించుకునేందుకు ఆ మార్గాన్ని కాకుండా వేరే మార్గాన్ని ఎంచుకుంటారు. ఇంకొందరూ ప్రభుత్వం సరైన చర్యలు చేపట్టాలని.. భద్రత కల్పించాలని డిమాండ్‌ చేస్తారు. నిత్యం మనతో తిరిగే గ్రామసింహానికే అంత భయపడితే.. దాని ప్లేస్‌లో చిరుత పులి ఉంటే.. ఆ గ్రామంలో నివసించే ప్రజల పరిస్థితి ఎలా ఉంటుంది. మెదక్ జిల్లాలో ఇలా చిరుత పులి సంచారం స్థానికులకు భయాందోళన కలిగిస్తోంది. గ్రామంలో ఓ లేగ దూడ(Calf)పై దాడి చేసి చంపేయడంతో ప్రతి క్షణం భయంతో బతుకుతున్నారు. మరికొన్ని ప్రదేశాల్లో చిరుత పులి అడుగులను గ్రామస్థులు గుర్తించారు. ఈ విషయం అధికారులకు తెలియజేయగా.. వారు వచ్చి పరిశీలించారు.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లాలోని మాసాయిపేట మండలం చెట్ల తిమ్మాయిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో చిరుత పులి(Cheetah) సంచారాన్ని గ్రామస్థులు గుర్తించారు. గ్రామంలోని పులిగుట్ట తండాకి చెందిన మాలోత్‌ కృష్ణకు చెందిన రైతు లేగ దూడను చిరుత పులి రాత్రి దాడి చేసి చంపి తినేసింది.

పులుల గణనకు వెళ్లి.. పులి దాడిలోనే మహిళా ఉద్యోగి మృతి

Forest Officers Visit Tiger Attack Place: ఆ గ్రామంలో గతంలో కూడా చిరుత పులులు సంచరించాయని తెలిపారు. అయితే ఎప్పుడు ప్రాణనష్టం జరగలేదని అంటున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా లేగ దూడ చనిపోవడంతో ఆ గ్రామంతో పాటు చుట్టు పక్కల ఉన్న గ్రామాల ప్రజలు భయపడుతున్నారు. ఈ విషయాన్ని అటవీశాఖ అధికారులకు తెలిపారు. వెంటనే ఘటనా స్థలాన్ని అటవీ శాఖ అధికారి ఓం ప్రకాష్‌, బీట్‌ అధికారి చిరంజీవి సందర్శించారు. దాడి జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. రైతుకు ప్రభుత్వ తరఫు సాయం అందేలా చేస్తామని హామీ ఇచ్చారు. చిరుత పులి సంచారంపై ఎలాంటి భయాందోళన పడవద్దని.. అది గ్రామాల్లోకి రాకుండా తగిన చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు. చిరుతను పట్టుకున్నేంత వరకు గ్రామంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని.. దాని జాడ తెలిస్తే వెంటనే అధికారులకి తెలియజేయాలని అన్నారు.

చిరుత పులి ఎదురు పడితే ఏం చేయాలి : చిరుత పులి ఒకవేళ దూరంగా ఎదురుపడితే అది మనపై దాడి చేసే అవకాశాలు తక్కువని.. అనుకోని సందర్భంలో దానికి సమీపంలో ఎదురుపడితే భయపడకుండా రెండు చేతులు పైకి ఎత్తి.. బిగ్గరగా అరవాలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే దానికంటే పెద్ద జంతువు ఏదో ఉందని పక్కకి తప్పుకుంటాయి. సాధారణంగా చిరుతపులులు ఎదురుగా ఉన్నవారిపై దాడి చేసే అవకాశాలు ఉండవని నిపుణులు చెబుతున్నారు.

Tiger wandering video: ఆ ప్రాంతంలో పులి సంచారం.. అటువైపుగా వెళ్లొద్దు!

పెంపుడు శునకంపై చిరుత దాడి.. కాపాడేందుకు యజమాని సాహసం

Tiger Wandering: మరోసారి పశువులపై పులి దాడి...

Last Updated : Aug 27, 2023, 5:31 PM IST

ABOUT THE AUTHOR

...view details