నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వైపుగా ఓ లారీ వస్తోంది. మెదక్ జిల్లా తూప్రాన్ పరిధిలోని అల్లాపూర్ వద్ద టోల్‌గేట్‌ను గమనించని లారీ డ్రైవర్ వాహనాన్ని విభాగిని పైకి ఎక్కించాడు. వెంటనే అప్రమత్తమై వేగం తగ్గించడం వల్ల టోల్‌బూత్‌ను ఢీకొట్టి పక్కకు ఒరిగింది. ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు టోల్ సిబ్బంది. ప్రమాద సమయంలో టోల్‌బూత్‌ను లారీ ఢీకొట్టిన దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి. ఇవి చూస్తే అక్కడ విధులు నిర్వహిస్తున్న వ్యక్తి త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారని అనక మానరు..
టోల్‌గేట్ బూత్‌పైకి దూసుకొచ్చిన లారీ - cctv visuals
టోల్‌గేట్ బూత్ పైకి లారీ దూసుకొచ్చిన ఘటన మెదక్ జిల్లా తూప్రాన్ పరిధిలోని అల్లాపూర్ టోల్‌గేట్ వద్ద చోటు చేసుకుంది. లోపల విధుల నిర్వహిస్తున్న వ్యక్తి త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.
![టోల్‌గేట్ బూత్‌పైకి దూసుకొచ్చిన లారీ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3929288-thumbnail-3x2-vysh.jpg)
టోల్‌గేట్ బూత్‌పైకి దూసుకొచ్చిన లారీ
TAGGED:
cctv visuals