కొవిడ్ టీకా ప్రతి ఒక్కరు తీసుకోవాలని నర్సాపూర్ ఎస్సై గంగరాజు పేర్కొన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో ఏర్పాటు చేసిన కరోనా టీకా పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నర్సాపూర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికీ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం టీకాలు ఇచ్చారు. ముందుగా సమాచారం ఇచ్చిన వారు సకాలంలో టీకా తీసుకోవాలని ఎస్సై సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, పోలీసులు పాల్గొన్నారు.
పోలీసులకు.. కొవిడ్ టీకా పంపిణీ - narsapoor police station
మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో పోలీసులకు కొవిడ్ టీకా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, పోలీసులు పాల్గొన్నారు.

పోలీసులుకు.. కొవిడ్ టీకా పంపిణీ