నారాయణఖేడ్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మెదక్ నుంచి నారాయణఖేడ్‌కు వెళ్తుండగా జాయింట్ రాడ్ విరిగిపోవడం వల్ల పసుపులేరు వంతెనపై రోడ్డుకు మధ్యలోనే ఆగిపోయింది. దీంతో రెండు గంటలపాటు ట్రాఫిక్ స్తంభించిపోయింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమాచారం అందుకున్న మెదక్ గ్రామీణం పోలీసులు ట్రాఫిక్‌ను నివారించి వంతెనపై ఆగిన ఆర్టీసీ బస్సును జేసీబీ సహాయంతో పక్కకు తరలించారు. బస్సులో ఉన్న 50 మంది ప్రయాణికులను తాత్కాలిక కండక్టర్ రాజేష్ వేరే బస్సులోకి ఎక్కించారు.
రోడ్డు మధ్యలో ఆగిన బస్సు... స్తంభించిన ట్రాఫిక్ - staggered traffic
జాయింట్ రాడ్ విరిగి ఓ ఆర్టీసీ బస్సు రోడ్డు మధ్యలోనే ఆగిపోయిన ఘటన మెదక్ జిల్లా పసుపులేరు వంతెనపై జరిగింది. రెండు గంటలపాటు ట్రాఫిక్ స్తంభించడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

రోడ్డు మధ్యలో ఆగిన బస్సు... స్తంభించిన ట్రాఫిక్
రోడ్డు మధ్యలో ఆగిన బస్సు... స్తంభించిన ట్రాఫిక్
ఇవీ చూడండి: ఆర్టీసీ విలీనంపై ఏపీలో జగన్ కమిటీ వేశారు అంతే!