సమత, మానసలపై హత్యాచారం చేసిన వారికి మరణదండన విధించాలని బుడగ జంగాల సంఘం మెదక్ జిల్లా అధ్యక్షుడు నర్సింహులు డిమాండ్ చేశారు. మెదక్ పట్టణంలో చిల్డ్రన్ పార్కు నుంచి కలెక్టరేట్ వరకు ప్లకార్డులతో భారీ ర్యాలీ నిర్వహించారు. దిశ ఘటన నిందితులను శిక్షించిన విధంగానే సమత కేసులోను వ్యవహరించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు రూ.50 లక్షలు పరిహారం, మూడెకరాల భూమి, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
'సమత కేసు నిందితులకు 'దిశ' తరహాలో శిక్ష విధించండి' - సమత కేసు వార్తలు
దిశ నిందితులను ఎన్కౌంటర్ చేసిన విధంగా సమత, మానస కేసుల్లోనూ వ్యవహరించాలని బుడగ జంగాల సంఘం జిల్లా అధ్యక్షుడు చిత్తారి నర్సింహులు డిమాండ్ చేశారు.
!['సమత కేసు నిందితులకు 'దిశ' తరహాలో శిక్ష విధించండి' budaga jangala association demands justice for samatha](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5407420-415-5407420-1576603395525.jpg)
'సమత నిందితులకు 'దిశ' మాదిరి శిక్ష విధించండి'
'సమత నిందితులకు 'దిశ' మాదిరి శిక్ష విధించండి'