తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రైవేటు ఉపాధ్యాయులను ప్రభుత్వం ఆదుకోవాలి: బీజేవైఎం - మెదక్ కలెక్టరేట్ ముందు బీజేవైఎం ధర్నా

బీజేవైఎం ఆధ్వర్యంలో మెదక్ కలెక్టరేట్ ముట్టడించారు. ప్రైవేటు ఉపాధ్యాయులు, లెక్చరర్లను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అదనపు కలెక్టర్ కార్యాలయంలో బైఠాయించి ధర్నా చేశారు.

bjym medak leaders protest at collectorate
ప్రైవేటు ఉపాధ్యాయులను ప్రభుత్వం ఆదుకోవాలి: బీజేవైఎం

By

Published : Oct 19, 2020, 4:06 PM IST

ప్రైవేటు ఉపాధ్యాయులను ప్రభుత్వం ఆదుకోవాలి: బీజేవైఎం
లాక్​డౌన్​తో ఆరు నెలలుగా జీతాలు లేకుండా ఇబ్బంది పడుతున్న ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్లలను ప్రభుత్వం ఆదుకోవాలంటూ... బీజేవైఎం ఆధ్వర్యంలో మెదక్ కలెక్టరేట్​ను ముట్టడించారు. అదనపు కలెక్టర్ ఛాంబర్​లో బైఠాయించి ధర్నా చేశారు.

ప్రైవేటు విద్యాసంస్థల్లో పనిచేసే సిబ్బంది దీనమైన స్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం నాయకులు సందీప్, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గడ్డం శ్రీనివాస్ రెడ్డి, నల్లాల విజయ్, జనార్దన్ పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details