మెదక్ పట్టణంలో బీజేవైఎం ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన నిర్వహించారు. సెప్టెంబర్17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.
'తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి' - medak bjp news
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ బీజైవైఎం జిల్లా శాఖ ఆధ్వర్యంలో మెదక్ పట్టణంలో కాగడాల ప్రదర్శన నిర్వహించారు. తెలంగాణ విమోచన పోరాటాన్ని పాఠ్యాంశంగా చేర్చడమే కాకుండా... పోరాటం జరిగిన స్థలాలను స్మృతి కేంద్రాలుగా తీర్చిదిద్దాలని డిమాండ్ చేశారు.
!['తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి' తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారకంగా చేయాలని బీజేవైఎం డిమాండ్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8816756-1080-8816756-1600227257053.jpg)
తెరాస సర్కారు మెజారిటీ ప్రజలను విస్మరిస్తూ... నిజాం తరహా పాలన చేస్తోందని మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ ఆరోపించారు. హైదరాబాద్ సంస్థానం నుంచి విమోచనం పొంది మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో విలీనమైన జిల్లాలలో ఆయా ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహిస్తుంటే తెలంగాణలో నిర్వహించకపోవడం దారుణమన్నారు. విమోచన దినోత్సవాన్ని అధికారకంగా నిర్వహించాలని భాజపా తరఫున డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పట్లొళ్ల శశిధర్ రెడ్డి, నర్సాపూర్ నియోజకవర్గ ఇంఛార్జి సింగాయిపల్లి గోపి పాల్గొన్నారు.
ఇదీ చూడండి:గోదావరి -కావేరి అనుసంధానంపై రాష్ట్రాలతో 18న కేంద్రం చర్చ