తెరాస నిరంకుశ పాలనకు మనస్తాపం చెంది ఆత్మహత్యకు యత్నించిన గంగుల శ్రీనివాస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ... మృతి చెందడం అత్యంత బాధాకరమని మెదక్ జిల్లా భాజపా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తున్నామని తెలిపారు. గంగుల శ్రీనివాస్ ఆత్మకు శాంతి చేకూరాలని... జిల్లా కేంద్రంలోని రాందాస్ చౌరస్తాలో నివాళులు అర్పించారు.
'గంగుల శ్రీనివాస్ మృతి అత్యంత బాధాకరం' - మెదక్ జిల్లా లేటెస్ట్ న్యూస్
గంగుల శ్రీనివాస్ మరణం అత్యంత బాధాకరమని మెదక్ జిల్లా భాజపా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ విచారం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని రాందాస్ చౌరస్తాలో నివాళులు అర్పించారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపుతో ధర్నా చేపట్టారు.
'గంగుల శ్రీనివాస్ మృతి అత్యంత బాధాకరం'
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపుతో తెరాస పాలనకు వ్యతిరేకంగా ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లాల విజయ్, పట్టణ అధ్యక్షుడు గుండు మల్లేశం, మండల అధ్యక్షుడు జనార్దన్, రవీందర్ రెడ్డి, గడ్డం కాశీనాథ్, బక్కవారి శివ, సాయి బాబా, ప్రభాకర్, దుర్గేశ్ తదితరులు పాల్గొన్నారు.