పేద ప్రజల పాలిట శాపమవనున్న ఎల్ఆర్ఎస్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మెదక్ జిల్లా తహసీల్దార్ కార్యాలయం వద్ద భాజపా నాయకులు ఆందోళనకు దిగారు. ఖజానాను నింపుకోవడానికే తెలంగాణ సర్కార్.. ఎల్ఆర్ఎస్ పేరిట ప్రజలను నిలువుదోపిడీ చేస్తోందని భాజపా మెదక్ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ విమర్శించారు. గ్రామస్థాయిలో ఇల్లు నిర్మించుకునే పేదలకు ఎల్ఆర్ఎస్ మరింత భారం కానుందని తెలిపారు.
ఖజానా నింపేందుకే ఎల్ఆర్ఎస్: భాజపా - bjp protest against Layout Regularisation Scheme
తెలంగాణ సర్కార్ ఖజానాను నింపుకోవడానికే ఎల్ఆర్ఎస్ పేరిట ప్రజలను నిలువుదోపిడీ చేస్తోందని భాజపా మెదక్ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ విమర్శించారు. గ్రామస్థాయిలో ఇల్లు నిర్మించుకునే పేదలకు ఎల్ఆర్ఎస్ మరింత భారం కానుందని తెలిపారు.
మెదక్లో భాజపా నేతల ఆందోళన
ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల సమయంలో ఎస్సీ,ఎస్టీలకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్రూం ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చి, ఇప్పటివరకు నెరవేర్చలేదని శ్రీనివాస్ మండిపడ్డారు. ఎల్ఆర్ఎస్ను వెంటనే రద్దు చేయకపోతే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం అధ్యక్షుడు నల్లాల విజయ్, మాజీ జడ్పీటీసీ మల్లప్ప, బెండ వీణ, భాజపా నాయకులు పాల్గొన్నారు.
- ఇదీ చూడండి: 'భూ సేకరణ అంశంలో మరింత స్పష్టత అవసరం'