నాగార్జునసాగర్‌లో గిరిజన, భాజపా కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జి చేయడాన్ని ఖండించారు ఆ పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్. గిరిజనులు, నిరుపేదలకు భాజపా అండగా ఉంటుందని స్పష్టం చేశారు. భూముల ఆక్రమణ పట్ల నిరసన చేపట్టిన భాజపా నాయకులపై లాఠీఛార్జి చేయడం పట్ల మండిపడ్డారు.
'ప్రభుత్వం ఇప్పటికైనా తీరు మార్చుకోవాలి' - Telangana news
గిరిజన, దళితుల భూముల జోలికి వెళితే ఊరుకొనేది లేదని హెచ్చరించారు భాజపా మెదక్ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్. నాగార్జునసాగర్‌లో గిరిజన, భాజపా కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జి చేయడాన్ని ఆయన ఖండించారు.
'ప్రభుత్వం ఇప్పటికైనా తీరుమార్చుకోవాలి'
ఇప్పటికైనా ప్రభుత్వం తీరుమార్చుకోవాలని.. గిరిజన, దళితుల భూముల జోలికి వెళితే ఊరుకొనేది లేదని హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి విజయ్, కోశాధికారి వెంకటేశం, నాయకులు జనార్దన్, శివ, కృష్ణ, మధు తదితరులు పాల్గొన్నారు.
- ఇదీ చూడండి :దేశంలో ఎక్కడా లేనివిధంగా గురుకులాలు: కేటీఆర్